సూపర్ స్టార్ కృష్ణ.. ఈయన ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు గా ఉండేవారు.ఇక అలాంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగానే తన కూతుర్ని వేరే హీరోకి దత్తత ఇవ్వాలనుకున్నారా..వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..కృష్ణ ఇందిరా దేవికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు కూతుర్లు. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మజ, మంజుల,ప్రియదర్శిని అనే కూతుర్లు.. అయితే ఈ ముగ్గురి కూతుర్లలో చిన్నదైనా ప్రియదర్శిని ని ఓ హీరోకి దత్తత ఇవ్వాలనుకున్నారట. ఇక అసలు విషయం ఏమిటంటే..రెబల్ స్టార్ కృష్ణంరాజు, కృష్ణ మూడో కూతురు ప్రియదర్శినిని దత్తత తీసుకుంటాను అని కృష్ణతో నేరుగా చెప్పారట.దానికి కృష్ణ నవ్వుతూ సరే తీసుకోండి మీ ఇష్టం అని చెప్పారట. అయితే వాళ్లు అలా సరదాగా అనుకున్న మాటలు నిజంగా దత్తత ఇవ్వలేదు. ఇక ఈ విషయాన్ని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో నేను కృష్ణ చిన్న కూతుర్ని దత్తత తీసుకోవాలనుకున్నాను అంటూ చెప్పారు.
న్యూస్ లైన్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ.. ఈయన ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు గా ఉండేవారు.అయితే అలాంటి ఈ హీరో తెలుగు ఇండస్ట్రీకి కౌబాయ్ సినిమాలను పరిచయం చేశారు.ఇక అలాంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగానే తన కూతుర్ని వేరే హీరోకి దత్తత ఇవ్వాలనుకున్నారా.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు.. వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ కృష్ణ కి ఇద్దరు భార్యలు. మొదట తన మేన మరదలు ఇందిరా దేవి ని పెళ్లి చేసుకున్న కృష్ణ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక విజయ నిర్మలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అటు విజయనిర్మలకు ఇటు కృష్ణకు ఇద్దరికీ రెండో పెళ్లే.ఇక విజయ నిర్మలకు పెళ్లయి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఒక కొడుకుని మొదటి భర్తకే వదిలేసి రెండో కొడుకు నరేష్ ని తీసుకొని వచ్చేసింది. ఇక కృష్ణ ఇందిరా దేవికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు కూతుర్లు. రమేష్ బాబు, మహేష్ బాబు,పద్మజ,మంజుల,ప్రియదర్శిని అనే కూతుర్లు.. అయితే ఈ ముగ్గురి కూతుర్లలో చిన్నదైనా ప్రియదర్శిని ని ఓ హీరోకి దత్తత ఇవ్వాలనుకున్నారట.
ఇక అసలు విషయం ఏమిటంటే..రెబల్ స్టార్ కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లు ఉన్నప్పటికీ కూడా కృష్ణ మూడో కూతురు ప్రియదర్శినిని దత్తత తీసుకుంటాను అని కృష్ణతో నేరుగా చెప్పారట.అయితే అప్పటికే కృష్ణ, కృష్ణ రాజు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ అనుబంధంతోనే కృష్ణంరాజు అలా అడిగారట.దానికి కృష్ణ నవ్వుతూ సరే తీసుకోండి మీ ఇష్టం అని చెప్పారట. అయితే వాళ్లు అలా సరదాగా అనుకున్న మాటలు నిజంగా దత్తత ఇవ్వలేదు. ఇక ఈ విషయాన్ని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో నేను కృష్ణ చిన్న కూతుర్ని దత్తత తీసుకోవాలనుకున్నాను అంటూ చెప్పారు.