అమెజాన్ ( AMAZON) తాజాగా తన ప్రైమ్ డే సేల్-2024 తేదీలను ప్రకటించింది. జులై 20 నుంచి 21వ తేదీ వరకు 48 గంటల పాటు ఈ ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తారు. ఈ సేల్ లో అమెజాన్ ప్రైమ్( AMAZON PRIME) మెంబర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అమెజాన్ ప్రైమ్ .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి...వెయిట్ చేస్తుంటాం...ఎప్పుడు ఆఫర్లు పెడతారో అని వెయిట్ చేస్తుూ ఉంటాం. వచ్చేశాయ్...అమేజాన్ ప్రైమ్ ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవ్వబోతుంది.
భారీ డిస్కౌంట్ ధరలు, కొత్త ప్రొడక్టులు, ఊరించే ఆఫర్లు... వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ . ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ( AMAZON) తాజాగా తన ప్రైమ్ డే సేల్-2024 తేదీలను ప్రకటించింది. జులై 20 నుంచి 21వ తేదీ వరకు 48 గంటల పాటు ఈ ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తారు. ఈ సేల్ లో అమెజాన్ ప్రైమ్( AMAZON PRIME) మెంబర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అమెజాన్ ప్రైమ్ .
కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల ( CREDIT CARD)పై కూడా డిస్కౌంట్లు లభించనున్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 10 శాతం వరకు రాయితీ లభించనుంది. అయితే ఈ డిస్కౌంట్ ఈఎంఐ ( EMI) కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ సేల్ లో టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్ , లాంటివి భారీ ఆఫర్లు దొరికే అవకాశం ఉంది.అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.