postImages/2024-07-02/1719920060_modiboss.avif

Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన

2024-07-02 06:47:42

న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభలో విపక్షాల ఆందోళన చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. పదేళ్లలో భారత్ ఖ్యాతి ఎంతో పెరిగిందని, అవినీతికి తావులేకుండా పరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, నేషన్‌ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామనన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజల ఆశీర్వాదం కోరామని, దేశ ప్రజలు మాపై భరోసా ఉంచారన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని, వికసిత్ భారత్‌తో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయిని మోడీ పేర్కొన్నారు. దేశానికి మార్గదర్శనం చేసిన రాష్ట్రపతికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. మోడీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. మణిపూర్‌ అంశంపై మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోడీ, స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు.  కాగా, మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే 15 పైసతలు మాత్రమే లబ్దిదారులకు అందేవని గుర్తు చేశారు. ఆ స్కామ్‌లు చూసి దేశప్రజలు నిరాశలో మునిగిపోయారన్నారు. ఒక ఇల్లు కావాలంటే పేదవాడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. నిస్పృహలో ఉన్న దేశాన్ని, మా ప్రభుత్వం బయటకు లాగిందని అన్నారు.