ఇద్దరు కుమారులతో ఆయనకు చాలా అనుబంధం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రీకొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు" .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ , డైరక్టర్ ప్రభుదేవాతో విడాకుల తర్వాత దాదాపు 10 యేళ్ల తర్వాత తన మాజీ భార్య రమ్లత్ రీసెంట్ గా ప్రభుదేవాపై షాకింగ్ కామెంట్లు చేశారు. తను మంచి భర్త అని పొగిడారు. ముఖ్యంగా తమ పిల్లల పట్ల ప్రభుదేవా చూపిస్తున్న ప్రేమ, బాధ్యతలను ఆమె కొనియాడారు. రీసెంట్ గా ప్రభుదేవా కొడుకు స్కూల్ లో ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. "పిల్లలే ఆయన ప్రాణం. ఇద్దరు కుమారులతో ఆయనకు చాలా అనుబంధం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రీకొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు" .
తన కొడుకు డ్యాన్స్ పర్ఫామెన్స్ పై రమ్లత్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాదు ..తన భర్త రక్తం తన పిల్లల్లో ఉంది. కాబట్టి ఇందులో ప్రత్యేకంగా ఏం అనిపించలేదని తెలిపారు. విడిపోయాక ఆయన నా గురించి ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడలేదు. మరి నేను మాత్రం ఎందుకు తప్పుగా మాట్లాడాలి అంటూ చెప్పుకొచ్చారు.ఇది జీవితం, దీనిని అంగీకరించాలి" అంటూ తాను వాస్తవాన్ని స్వీకరించి ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుదేవా రెండో వివాహం చేసుకుని, మరో కుమార్తెకు తండ్రి అయినప్పటికీ మొదటి భార్య, పిల్లల పట్ల ఆయన బాధ్యతగల తండ్రిగానే కొనసాగుతున్నారని రమ్లత్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.