భద్రాద్రి లో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామి వారి కళ్యాణాన్ని కళ్లారా చూసి తరిద్దామని చాలా మంది అనుకుంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే అందరు భద్రాచలం వెళ్లలేరు కదా. కాబట్టి ఇంటికే తలంబ్రాలు తెప్పించుకునే అవకాశం ఉంది. భద్రాద్రి లో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామి వారి కళ్యాణాన్ని కళ్లారా చూసి తరిద్దామని చాలా మంది అనుకుంటారు.
అయితే, ఆర్థిక కారణాలతెో, సమయం దొరకకో, అనారోగ్య కారణాల వల్లో వెళ్లలేకపోతుంటారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని టీవీల్లోనే చూస్తారు. భద్రాద్రి కి వెళ్లలేకపోతున్నప్పటికి దేవాదాయశాఖ సాయంతో భక్తుల ఇంటికి తలంబ్రాలను తెచ్చి అందిస్తామంటున్నారు టీజీఆర్టీసీ . తలంబ్రాలు కావాలనుకుంటున్న వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలలో సంప్రదించవచ్చు.
లేదంటే tgsrtclogistics.co.inలో వివరాలు నమోదు చేసి తలంబ్రాలు తెప్పించుకోవచ్చు. ఇందుకుగానూ రూ.151 చెల్లించాల్సి ఉంటుంది. దీని పై ఉన్న సందేహాలు తీరడానికి 040 69440069 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ తలంబ్రాలు రాములవారి కళ్యాణం జరిగిన తర్వాత పంపిస్తారు.