Sukesh Chandra: తీహార్ జైలు నుండి సీఎం బాబుకు లేఖ 2024-06-22 06:39:59

న్యూస్ లైన్ డెస్క్: తీహార్ జైలు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్‌లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.500 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్‌ నిర్మించారని చెబుతుండటంతో అందరూ షాకవుతున్నారు. తిహార్‌ జైలులో ఉంటున్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్యాలెస్‌పై ఆసక్తి చూపించాడు. రిషికొండ భవనాలను కొనడానికి అవకాశం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబును కోరుతూ సుఖేశ్‌ చంద్రశేఖర్‌ లేఖ రాశారు. అమ్మడం కుదరకపోతే కనీసం లీజుకు అయినా ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా 20 శాతం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు.