majaka: సందీప్ కిషన్ " మజాకా " ట్రైలర్ రిలీజ్ !

ఫుల్ నవ్వులు ..పూయించే ఉద్దేశ్యంతో క్లియర్ లైనప్ కామెడీ అండ్ యాక్షన్ తో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రోజు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


Published Feb 23, 2025 02:59:00 PM
postImages/2025-02-23/1740303212_SundeepRituVarmaMazaka.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సందీప్ కిషన్ " మజాకా " ట్రైలర్ వచ్చేసింది. సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథరావు నక్కిన డైరక్షన్ లో మాజాకా మూవీ తెరకెక్కుుతంది. ఈ సినిమా కు స్టార్ రైటర్ ప్రజన్న బెజవాడ కథ , మాటలు అందిస్తున్నారు. అయితే సందీప్ కిషన్ భైరవకోన సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఇందులో సందీప్ కిషన్ ..తండ్రి క్యారక్టర్ లో రావు రమేష్ చేస్తున్నారు. అయితే ఫుల్ నవ్వులు ..పూయించే ఉద్దేశ్యంతో క్లియర్ లైనప్ కామెడీ అండ్ యాక్షన్ తో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రోజు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


ఇక ట్రైలర్ చూస్తుంటే.. తండ్రి కొడుకులు ఇద్దరూ వేరువేరు ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ, పెళ్లితో ఫుల్ లెంగ్త్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో ప్రసన్న మార్క్ కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. చివర్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొచ్చి బాలయ్య బాబు ప్రసాదం కళ్లకద్దుకొని తాగాలి అని జై బాలయ్య డైలగ్స్ ను ట్రైలర్ లో చూపించారు. దీంతో తండ్రీ కొడుకులు ఫుల్ గా నవ్విస్తారని తెలుస్తుంది.


 

newsline-whatsapp-channel
Tags : movie-news sandeep-kishan rao-ramesh

Related Articles