తెల్లారకముందే ఇంటి ముందుకు వేడి వేడి వార్తలను మోసుకొచ్చే కుర్రాళ్లు. ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగే సైకిల్ గంటలు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా మందికి ఇదే పార్ట్ టైమ్ ఉద్యోగం. పేపర్ అంటూ
నేడు వరల్డ్ పేపర్ బాయ్ డే
న్యూస్ లైన్ డెస్క్: తెల్లారకముందే ఇంటి ముందుకు వేడి వేడి వార్తలను మోసుకొచ్చే కుర్రాళ్లు. ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగే సైకిల్ గంటలు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా మందికి ఇదే పార్ట్ టైమ్ ఉద్యోగం. పేపర్ అంటూ అంతెత్తున ఉండే అపార్ట్‌మెంట్‌లోకి కళాత్మకంగా విసిరే నైపుణ్యం వారి సొంతం. నెల జీతం చిన్నదే అయినా.. ఒకరి మీద ఆధారపడకుండా ఎంతో కొంత సంపాదించే స్వయంకృషి వారిది. అలాంటి పేపర్ బాయ్స్ కోసం ఓ రోజు ఉందండోయ్. ఏటా సెప్టెంబర్ 4న ‘వరల్డ్ పేపర్ బాయ్స్ డే’గా జరుపుకుంటున్నారు.
1833లో ‘ది న్యూయార్క్ సన్’ అనే పత్రిక ఇదే రోజున పదేళ్ల ‘బార్నే ఫ్లాహెర్టీ’ అనే అబ్బాయిని పేపర్ బాయ్‌గా అపాయింట్ చేసుకుంది. చరిత్రలో రికార్డ్ అయిన తొలి పేపర్ బాయ్ ఉద్యోగం ఇదే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4 అనేది ‘వరల్డ్ పేపర్ బాయ్స్ డే’గా స్థిరపడింది. దీన్నే ‘న్యూస్ పేపర్ క్యారియర్ డే’ అని కూడా అంటున్నారు. అలాగే అక్టోబర్ 8 కూడా ‘ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ క్యారియర్ డే’గా పిలవబడుతుంది. పేపర్ బాయ్ నుంచి పెద్ద పెద్ద కొలువుల స్థాయికి ఎదిగిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి డా|| జి. లక్ష్మీషా.. పేపర్ బాయ్‌గా పని చేసిన వారే. నెలకు రూ.300లు అందుకున్నానని ఆయన గతంలో చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా పేపర్ బాయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది.