న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగారం ధర వరుసగా మూడో రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి అయితే ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం ..బంగారం నిన్నటిమీద దాదాపు గ్రాము మీద 24 రూపాయిలు తగ్గింది. వెండి గ్రాము మీద 100 రూపాయిలు తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది. గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటే పసిడి ధర 63,490 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,640గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,410గా ఉంది . ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది
ఈ సారి వెండి ధర దాదాపు కేజీ 86900 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది. విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది. ఢిల్లీ లో మాత్రం భారీగా వెండి ధర తగ్గింది. దాదాపు 5,100 తగ్గి 81900 గా నమోదయ్యింది. ముంబైలో కూడా ఇదే రేటుకు అమ్ముడవుతుంది.