IAS: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు 2024-06-23 12:01:16

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ(AP)లో భారీగా ఐఏఎస్‌(IAS)ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు(Chandrababu) తాజాగా, ఐఏఎస్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీని నియమించారు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీతను బదిలీ చేసి ఆమె స్థానంలో దినేష్‌కుమార్ ను నియమించారు. మరోవైపు, విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ చేసి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మల్లికార్జున స్థానంలో విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్, ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బీ.ఆర్.అంబేడ్కర్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణిలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజనలను నియమించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియాను, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషాకు బాధ్యతలు అప్పగించగా.. బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.