అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న మెడిసన్స్ పై ఎక్కువ మొత్తంలో సుంకాలు విధించడానికి రెడీ అవుతున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుధ్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్ తో సహా చాలా దేశాలపై టారిఫ్ లు ప్రకటించారు. రీసెంట్ గా మరో షాకింగ్ న్యూస్ ను షేర్ చేశారు. త్వరలో ఔషధ ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఔషధ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించనున్నట్లు ప్రకటించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న మెడిసన్స్ పై ఎక్కువ మొత్తంలో సుంకాలు విధించడానికి రెడీ అవుతున్నారు.
అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావడం లేదన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ చర్యతో చైనా సహా చాలా దేశాల్లో ఫార్మా కంపెనీలన్నీ అమెరికాకు తరలివస్తాయని అక్కడ ఫ్లాంట్లను తెలరుస్తాయని వ్యాఖ్యనించారు. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు మెడిసన్స్ పై సుంకాలు మినహాయింపు ఉండేది. కాని ఇప్పుడు మెడిసన్స్ పై కూడా సుంకాల మోత మొదలుపెడుతున్నారు. అమెరికా ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన ఔషధాలు అందడంలో భారతీయ ఫార్మా కంపెనీలది కీలకపాత్ర. భారత్ అమెరికాకు చేసే ఔషధ ఎగుమతులు ఎక్కువగా జనరిక్ మందులే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికాకు భారత్ నుంచి 9 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. భారత్ చేసుకుంటున్న దిగుమతులతో పోల్చితే ఇది 10 రెట్లు అధికం.