AI : ‘A I’ ఎఫెక్ట్‌ – వచ్చే ఏడాదికి 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్‌ ..! 2024-06-19 15:36:20

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రోబో( ROBO)  అంటేనే ఏంటి రోబోనా అనేవాళ్లం ...రోబో ను తలదన్నే టెక్నాలజీ( TECHNOLOGY)   వచ్చేసింది. ఇక అచ్చం మనిషిలా ఉండే వర్చువల్ రూపం ..చూడగలం కాని ముట్టుకోలేం. కాని మనకి కావాల్సిన బేస్ లో వాయిస్ ఛేంజ్ చేస్తూ మంచి మంచి ప్రొగ్రామ్స్ డిజైన్ చేసుకోవచ్చు. అయితే దీనితో వచ్చిన చిక్కల్లా ఉద్యోగాలు పోతాయి. వెయ్యి మంది పని ఒక్క ఏఐ చేసేస్తే మరి ఉద్యోగాల సంగతేంటి ...రానున్న ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు అసలు కనపడవంటున్నారు.


ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. 9 దేశాల్లో 18 రంగాల్లో ఉన్న ప్రముఖ సంస్థల టాప్‌ ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం.నిజానికి దగ్గరగా ఉండే వీడియోలు( VIDEOS) , ఇమేజీలు( IMAGES) , టెక్ట్స్‌లు( TEXT) సృష్టించడంలో జెనరేటివ్‌ ఎఐ ఆధారిత టెక్నాలజీలు పరుగులెడుతున్నాయి. యానిమేషన్( ANIMATION) , గ్రాఫిక్స్ ( GRAPHICS)లాంటి టెక్నికల్ పనుల్లో ఏఐ ఎఫెక్ట్( AI EFFECT) ఇఫ్పటికే చాలా ఉంది. పనులు సులభం.. తక్కువ ఖర్చు.. అనే అంచనాలున్నాయి. ఏఐ ఎఫెక్ట్ తో ఇప్పుడున్న గ్రాఫిక్ డిజైనర్లు..టెక్నికల్ డిపర్ట్ మెంట్స్( TECHNICAL DEPARTMENT) కాస్త మరుగున పడతాయి. అయితే అప్ డేట్ అయితే ప్రమాదమే లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.


ఎఐ చాట్‌బాట్స్‌( AI CHAT BOX) పై గూగుల్‌( GOOGLE) , మైక్రోసాఫ్ట్‌ ( MICRO SOFT) వంటి కంపెనీలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. ఇక ఉద్యోగాల కోతలు తప్పేలా లేవని నిపుణులు అంటున్నారు. ఎఐ వినియోగం పెరిగాక ఉద్యోగాల్లో కోతలు తప్పట్లేదని అనేక సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఎఐ ( AI) వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు కనుమరుగుకావచ్చని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ గోల్డ్‌మన్‌ సాక్స్‌కు చెందిన నిపుణులు గతంలో అంచనా వేశారు. 


పదేళ్ల క్రితం డిజిటల్‌ టెక్నాలజీ( DIGITAL TECHNOLOGY)  గురించి ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి.కాని ఆ టెక్నాలజీ వల్ల మరింత ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఎఐ విషయంలో కూడా కనుమరుగయ్యే ఉద్యోగాలు, కొత్త వాటి మధ్య సమతౌల్యం ఉంటుంది అని అన్నారు.