Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ! 2024-06-30 20:07:53

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) బాధ్యతలు చేపట్టారు. జమ్ముకశ్మీర్ ( jammu kashmir)  రైఫిల్స్‌కి చెందిన ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్మీకి వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్( mp)  లో పుట్టి పెరిగిన ద్వివేది సైనిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో చీఫ్ గా నియమితులయ్యారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ సి పాండే ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది వచ్చారు. జూన్ 11వ తేదీనే ద్వివేదిని ఆర్మీ చీఫ్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


 అటు ఉత్తరం, పశ్చిమంతో పాటు ఇటు తూర్పులోనూ ఎడారులు, అత్యంత ఎత్తైన ప్రాంతాలు, బిల్టప్ ఏరియాలు..ఇలా అన్ని ప్రతికూల వాతావరణాల్లోనూ ఆయనకు పని చేసిన అనుభవముంది. అంతేకాదు పాక్, చైనా బోర్డర్స్ లో ఆయన చాలా శక్తివంతంగా పనిచేశారు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌పై పూర్తి స్థాయి పట్టుంది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల్ని ఏరి వేసేందుకు స్పెషల్ ఆపరేషన్‌లు చేపట్టారు. 


అటు రాజస్థాన్( rajasthan)  ఎడారిలోనూ ఇదే స్థాయిలో దూకుడు ప్రదర్శించారు. అస్సాం రైఫిల్స్‌లోనూ కమాండర్‌గా పని చేశారు ఉపేంద్ర ద్వివేది.  మొత్తం 40 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌ నుంచి వచ్చే ప్రమాదాలు ఎదుర్కోవడంలో...చాలా దిట్ట. రెండేళ్ల పాటు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గానూ పని చేశారు.