Joe Biden: వయసైపోతుంది...నీకెందుకు అధ్యక్షపదవి..బైడెన్ కు ఫ్రెండ్ సలహా ! 2024-06-30 20:45:13

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా( america)  అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనుండగా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( joe biden)  మరోసారి పోటీ చేస్తున్నారు.బైడన్ వయసు రీత్యా ఇక ఆయన పోటీ చేయకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు సన్నిహితులు. తాజాగా బైడెన్ బాల్య స్నేహితుడు, ప్రముఖ రచయిత జే పారిని( jae parini)  కూడా ఇదే రీతిలో స్పందించారు. పారిని రాసిన బహిరంగ లేఖ సీఎన్ఎన్ ( csn openion page) ఓపీనియన్ పేజిలో ప్రచురితమైంది. 


ఇప్పుడు నువ్వు కూడా నాలాగా చాలా ముసలాడివి అయిపోయావు. రోజంతా పనిచేసేందుకు బలవంతంగా శక్తిని కూడదీసుకోవాల్సి రావడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనకు వయసు పైబడిపోయింది. ఒకప్పుడు సహకరించినట్టుగా శరీరాలు ఇప్పుడు సహకరించవు. ఒక్కోసారి ఉదయం లేవడానికి కూడా ఇబ్బంది పడిపోతాం. అట్లాంటాలో నువ్వు గురువారం నాడు హాజరైన డిబేట్ చూశాక ఏడుపొచ్చినంత పనైంది. వేదికపైకి రావడానికే నువ్వు ఇబ్బందిపడడం కనిపించింది. వేదికపై నువ్వు తడబడడం, అయోమయంగా చూడడం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు ఎప్పటివాడివో... నీలో గట్టిదనం లేదు, పెళుసుబారిపోయావు. నీ పరిస్థితి చూశాక నాకు తెలియకుండానే నేను ఏడ్చేశాను. నీ కోసం, దేశం కోసం కన్నీరుపెట్టాను" అని జే పారిని తన బహిరంగ లేఖలో వివరించారు.


వయసు ను దృష్టి లో పెట్టుకొని ...ఇంకా పట్టుదలకు పోకుండా ..ఈ అవకాశం మరో ...యంగ్ స్టర్ కి ఇస్తే బాగుంటుందని తన ఫ్రెండ్ సజిస్ట్ చేశారు. నీకు ఓపిక లేనపుడు కూడా ఇంకా దేనికి ఆరాటపడుతున్నావంటు ప్రశ్నించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఫుల్ వైరల్ అవుతుంది.