Kurukshetra : మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం కథేంటి ?

కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుధ్ధం జరిగిన ప్లేసే కాదే..హర్యానా లో ఉంది ఈ కురుక్షేత్రం జరిగిన ప్రదేశం..ఈ ప్రాంతానికి చాలా స్థలపురాణం ఉంది.  ద్వాపరయుగంకన్నా ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు. ఆ చుట్టుపక్కల 8 నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు..తన బంగారు రథం నుంచి కిందకు దిగివచ్చి నాగలి తయారు చేశాడు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-30/1719755112_10192021162417n26.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుధ్ధం జరిగిన ప్లేసే కాదే..హర్యానా లో ఉంది ఈ కురుక్షేత్రం జరిగిన ప్రదేశం..ఈ ప్రాంతానికి చాలా స్థలపురాణం ఉంది.  ద్వాపరయుగంకన్నా ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు. ఆ చుట్టుపక్కల 8 నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు..తన బంగారు రథం నుంచి కిందకు దిగివచ్చి నాగలి తయారు చేశాడు. 


ఆ పరమేశ్వరుడిని పూజించి నందిని...యముడిని ప్రార్ధించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమి దున్నడం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన ఇంద్రుడు ..ఏం చేస్తున్నామని అడిగాడట. సత్యం, దయ, క్షమ, దానం, స్వచ్ఛత, నిష్కామం, బ్రహ్మచర్యం, యోగం అనే 8 పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు కురు రాజు. 
ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు(MAHAVISHNU) స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగితే..మళ్లీ అదే సమాధానం చెప్పాడు కురు మహారాజు. అయితే విత్తనాలేవని అడిగితే..తన శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు ఏవరం కావాలో కోరుకోమనడంతో కుర్రాడు వెంటనే తాను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తనపేరుతో వర్థిల్లాలని..ఇక్కడ పోయిన ప్రతిప్రాణి స్వర్గానికి చేరుకోవాలన్నాడు. సరే అని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలా కురు రాజు క్షేత్రంగా మలచాలి అనుకున్నప్రదేశం కురుక్షేత్రం అయింది.  


మాయాజూదంలో ఓడిన పాండవువు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్నాక మహాభారతయద్ధం(MAHA BHARATHAM) జరిగింది. మహా సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు కురుక్షేత్రం ప్రదేశాన్ని ఎంపిక చేశాడు ధృతరాష్ట్రుడు. దీనివెనుకున్న ఉద్దేశం ఏంటంటే.. పరాక్రమవంతులు, ధర్మపరులైన పాండవు చేతిలో తన సంతానం అయిన కౌరవులు ఎలాగూ మరణిస్తారు..వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని చెబుతారు.  


కురుక్షేత్రలో చూసితీరాల్సిన కట్టడాలేమీ లేవు. బ్రహ్మసరోవరం ( BRAHMA SAROVARAM) అనే ఓ కొలను..దాని ఒడ్డునే లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. చాలా పెద్ద కొలను...ప్రస్తుతం దీని 1170 మీటర్లు ఇప్పుడు స్నానమాచరించి పుణ్యప్రదంగా భావిస్తారు. గ్రహాణ స్నానాలు చేస్తుంటారు. ఉత్తర ప్రదేశ్ ( UP) లో చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజు వచ్చి స్నానమాచరించే భక్తులతో కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మరసరోవరం నిండిపోతుంది. 


అంపశయ్యమీదున్న భీష్ముడి( BHEESHMUDU)  దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని చెబుతారు. కురుక్షేత్రకి మరోవైపు జ్యోతి సర్ అని మరో కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్థలపురాణం. బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపు బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలున్నాయి. 
 

newsline-whatsapp-channel
Tags : mahabharatham kurukshethram brahma-sarovaram

Related Articles