Tata :నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది ? ధర ఎంత ఫీచర్స్ ఏంటి?

దేశంలో ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు టాటానానో కారు ఓ సెన్సేషన్. 2008 వ సంవత్సరంలో కేవలం రూ..లక్ష రూపాయిలకు కారు మార్కెట్ లోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే.


Published Jul 12, 2024 12:34:00 PM
postImages/2024-07-12/1720767938_A9ooibFv.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  దేశంలో ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు టాటానానో కారు ఓ సెన్సేషన్. 2008 వ సంవత్సరంలో కేవలం రూ..లక్ష రూపాయిలకు కారు మార్కెట్ లోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే.


2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా ఆపేసింది. సేఫ్టీ లేదు...పేలుతున్నాయి లాంటి కారణాలతో ఎందుకో టాటా ఈ కారును ఆపేశారు. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మళ్లీ రీలాంఛ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. అది కూడా ఎలక్ట్రికల్ కారు.. టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్కులేట్‌ అవుతున్నాయి. ఈ కారు 2024 చివర్లో లాంఛ్ అవుతుందని.. ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్స్ కూడా ఇలా ఉంటున్నాయంటు కధలు కధలు గా చెప్పుకుంటున్నాయి మార్కెట్ వర్గాలు.


ఈ కారుకు 4 డోర్లు, 4 సీట్లు ఉంటాయి. ఇక.. బ్యాటరీ విషయానికొస్తే.. 17 kWh బ్యాటరీ ఉండనుందట. దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్.. R12 profile టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే.. 3.3 kW, AC ఛార్జర్‌, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చెయ్యాలని అనుకుంటుందట...టాటా.  అయితే కారు బేసిక్ ధర దాదాపు 5 లక్షల నుంచి ఇదే కారు హై ఎండ్ ఫీఛర్స్ ధర 8 లక్షల రూపాయిలు ఉండొచ్చు.


ఈ కారు కాని క్లిక్ అయితే ...ఇప్పుడున్న కార్లకు మంచి కాంపిటీషన్ అవుతుందంటున్నారు. అసలే టాటా ...రతన్ టాటా నే ఈ కారుకు బ్రాండ్ ..మధ్యతరగతి వారి కోసం రతన్ టాటా మరో సారి నానో కార్ ను లాంఛ్ చెయ్యాలని ఇప్పటి కే చాలా మంది అభిప్రాయపడ్డారు. టాటా కు మెయిల్స్ కూడా చేశారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business

Related Articles