BSNL : జియో మెడలు వంచిన బీఎస్ఎన్ఎల్.. దెబ్బకు దిగొచ్చిందిగా


Published Sep 04, 2024 04:42:02 PM
postImages/2024-09-04/1725448322_jiovsbsnl.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ప్రారంభించిన తొలిరోజుల్లో ఉచితం అంటూ ఊరించి.. క్రమంగా జనాల జేబుకు చిల్లు పెట్టిన జియో కంపెనీకి బీఎస్ఎన్ఎల్ మంచి దెబ్బ కొట్టింది. కస్టమర్లను పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ పెట్టిన ఆఫర్లకు జియో సైతం దిగొచ్చి కొత్త ఆఫర్లను ప్రకటించింది.

బీఎస్ఎన్ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో నెలకు రూ.173 రూపాయలు, ఏడాదికి రూ.1,899 ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే ఆఫర్ తెచ్చింది. ఫ్రీ రోమింగ్ తో పాటు 3600 మెసేజులు, ఫ్రీ జియో యాప్ లు, అదనంగా 24 జీబీల డేటా అందిస్తోంది. రూ.189 ప్లానింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఎస్ఎంఎస్ లు 2జీబీ డేటా అందిస్తోంది.

newsline-whatsapp-channel
Tags : latest-news news-updates jio bsnl network

Related Articles