Today Gold Price: పడిపోతున్న పసిడి ధర...వెండిని రేటుకు అడ్డు లేదు !

ఈ రోజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని ప్రధాన నగరంలోను తగ్గింది.


Published Aug 31, 2024 06:55:00 AM
postImages/2024-08-31/1725067597_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధరలు తగ్గడం అంటే ..మూడో ప్రపచం ముక్కలయినట్టే. ఎప్పుడు ధరలు చుక్కలు చూపిస్తూనే ఉంటుంది. ఆ కాస్త తగ్గే 10, 20 కి మనం సంబరపడాలంతే. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూనే వస్తుంది . ఒకే సారి వందలు, వేలు పెరుగుతుంది..రోజు రోజుకి ప్రసాదం పది , ఇరవై తగ్గుతుంది. కాని ఏదైనా తగ్గడమే కదా...కాస్త హ్యాపీ గా ఫీలవుదాం.


ఈ రోజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని ప్రధాన నగరంలోను తగ్గింది. తులంపై రూ. 10 తగ్గింది. అంటే గ్రాము మీద నిన్నటి రేటు కు రూపాయి తగ్గినట్లు . అయితే ఇది శనివారం ఉదయం 6-30 నిమిషాలకు నమోదయిన రేటు. మనకి తెలిసిందే ...మార్కెట్లో బంగారం ఎప్పుడు తగ్గుతూ , పెరుగుతూ మధ్యతరగతి ఆశలకు ఆవిరి చేస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి బంగారం ధర గ్రాము 6700 గా ఉంది. అది కూడా 22 క్యారట్ల బంగారం . 


* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,190కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,290 వద్ద కొనసాగుతోంది.


* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 గా ఉంది.


*చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సిటీల్లోను ఇదే రేటు నడుస్తుంది.


* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది.


అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ధర నడుస్తుంది. విశాఖ , విజయవాడ, విజయనగరం , గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి ఇటు హైదరాబాద్ , నిజామాబాద్ , మహాబూబ్ నగర్, వరంగల్ అన్ని జిల్లాల్లోను ఇదే రేటును ఫాలో అవుతున్నారు వ్యాపారులు. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900గా ఉండగా.. ముంబయిలో రూ. 88,300, బెంగళూరులో రూ. 87,600 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 92 వేల చిల్లరకు అమ్ముతున్నారు వ్యాపారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business india goldrates silver-rate

Related Articles