Flipkart : ఫ్లిప్ కార్ట్ లో జాబ్ మేళా.. లక్ష ఉద్యోగాలకు పిలుపు


Published Sep 04, 2024 07:37:29 PM
postImages/2024-09-04/1725458849_flipkartjobs.jpg

న్యూస్ లైన్ డెస్క్ : త్వరలో రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. బిగ్ బిలియన్ డే సేల్ 2024 కోసం లక్షమంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది.

దేశంలోని 9 నగరాల్లో మొత్తం 11 రిక్రూట్ సెంటర్లు ఏర్పాటు చేసి రిక్రూట్ మెంట్ ప్రారభించింది. గతంలో ఏర్పాటు చేసిన రిక్రూట్ మెంట్ సెంటర్లతో కొత్తగా ఏర్పాటు చేసిన 11 కలిపి ఫుల్ ఫిల్ మెంట్ల సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిక్ కార్ట్ తెలిపింది. పండుగల సీజన్ లో భారీ సేల్.. భారీ ఆఫర్లతో పాటు కస్టమర్లకు వేగంగా సర్వీసులు అందించేందుకు ఈ రిక్రూట్ మెంట్ చేపడుతున్నట్టు ఫ్లిప్ కార్ట్ కమ్యూనిటీ ప్రకటించింది.

newsline-whatsapp-channel
Tags : hyderabad business amazon-prime latest-news news-updates telugu-news

Related Articles