సినిమా హిట్టు అయితేనే బిజినెస్ ..లేదంటే డైరక్టర్ కు ఆప్షన్ లేదు..ఓటీటీ చెప్పిన రేటుకు ఇవ్వాల్సిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు ఇండస్ట్రీ లో చిన్న సినిమా సూపర్ డూపర్ సినిమా ఏంటంటే..35 చిన్న సినిమా కాదు. ఇంకా థియేటర్ లో నడుస్తూనే ఉంది. అప్పుడే ఓటీటీ మాటలు నడుస్తున్నాయి. ఇంతకు ముందు అసలు సినిమా వచ్చిందంటే ఓటీటీ బిజినెస్ జరిగేది. కాని ఇఫ్పుడు అలా కాదు..సినిమా హిట్టు అయితేనే బిజినెస్ ..లేదంటే డైరక్టర్ కు ఆప్షన్ లేదు..ఓటీటీ చెప్పిన రేటుకు ఇవ్వాల్సిందే.
. ఆల్రెడీ గోట్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి చూసేసాం. ఇక ఇప్పుడు నివేద నటించిన 35 చిన్న కథ కాదు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్ డేట్ కూడా వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుంది. థియేటర్ లో ప్రస్తుతం చాలా బాగా నడుస్తుంది. థియేటర్ లో ఎన్ని రోజులు నడుస్తుందో చూసి అప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేస్తారన్నమాట.
రానా దగ్గుబాటి సమర్పించడంతో.. ఇంకాస్త హైప్ నెలకొంది. తిరుపతి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పించింది. ప్రతి మిడిల్ క్లాస్ లో జరిగే రోజు వారి సన్నివేశాలను ఎంతో నేచురల్ గా సినిమాలో చూపించారు. మేకర్స్ కథ ను ఎంచుకున్న దగ్గరే సగం సక్సెస్ అయ్యారని చెప్పి తీరాల్సిందే. ఇక లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఓటీటీ రైట్స్ ఆహా తీసుకుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదంతే.