vijay devarakonda: విజయ్ దేవరకొండ సినిమా " కింగ్ డమ్ " మూవీ వాయిదా !

ఈ సినిమా కి కింగ్ డమ్ అనే పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది.


Published Jun 10, 2025 09:34:00 PM
postImages/2025-06-10/1749571551_vijayf67d62a234Vjpg799x4144g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా కింగ్ డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి కింగ్ డమ్ అనే పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. ఈ విషయాన్ని తమ్ముడు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే జులై నాలుగో తేదీనే తమ్ముడు రిలీజ్ అవుతుంది. దీంతో​ కింగ్​డమ్ మూవీ జూలై 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్, ఫార్య్టూన్ ఫోర్​ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ టీజర్ రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఈ టీజర్ లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ వాయిస్ , విజువల్స్ తో టీజర్ ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. 


టీజర్​ ఇప్పటికే 18 మిలియన్​ వ్యూస్​ దక్కించుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్​ అయినా 'హృదయం లోపల' సాంగ్​ 11 మిలియన్​ వ్యూస్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ సింగిల్​ యూత్​ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news vijay-deverakonda

Related Articles