papa: తమిళ్ సినిమా " డా డా "...తెలుగులో రిలీజ్ !

ఈ మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నెల 13న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ అవ్వనుంది.


Published Jun 11, 2025 04:08:00 PM
postImages/2025-06-11/1749638403_papa.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  కవిన్ , అపర్ణా దాస్ జంటగా తెరకెక్కిన తమిళ్ మూవీ " డాడా " 2023 లో తమిళ్ లో చిన్న సినిమా రిలిజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. భాగ్యరాజ్ , ఐశ్వర్య భాస్కరన్ , గణేష్ ముఖ్య పాత్రల్లో గణేష్ కె. బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో పాపా అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నెల 13న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ అవ్వనుంది.


పాపా ట్రైలర్ లాంచ్ ఈ వెంట్ కి సీనియర్ డైరక్టర్స్ ఎ. కోదండరామిరెడ్డి  బి. గోపాల్ లు గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడే పాపా ట్రైలర్ చూశానని చాలా బాగుందని అన్నారు. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని అన్నారు. తమిళ్ లో 42 కోట్లు కలక్ట్ చేసింది. తెలుగులో రిలీజ్ చేస్తున్నారని...పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని మంచి కలక్షన్స్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news tamilnadu

Related Articles