alluarjun: త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లుఅర్జున్ !

త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టి మరీ అట్లీ సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు అల్లు అర్జున్ .


Published Jun 11, 2025 03:02:00 PM
postImages/2025-06-11/1749634379_trivikramntralluarjun1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  పుష్ప 2 తర్వాత అల్లుఅర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. అల్లుఅర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారని అధికారికంగానే ప్రకటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మైథాలజీ సినిమా చేయబోతున్నారని అల్లు అర్జున్ సుబ్రమణ్యస్వామిగా కనిపించబోతున్నారని హింట్స్ కూడా ఇచ్చేశారు. అయితే త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టి మరీ అట్లీ సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు అల్లు అర్జున్ .


అయితే రీసెంట్ గా నేడు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. నిర్మాత నాగవంశీ కార్తికేయ స్వామికి సంబంధించిన రెండు శ్లోకాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫేవరేట్ అన్న మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నాడు అని ట్వీట్ చేసారు. నాగవంశీ ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని అందరికి తెలిసిందే. ఈ విషయం నాగవంశీ కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పారు. 


నాగవంశీ ఫేవరేట్ హీరో ఎన్టీఆర్. అయితే చాలా సార్లు నాగవంశీ చెప్పారు. ఇక కార్తికేయ స్వామి శ్లోకాలు షేర్ చేయడంతో త్రివిక్రమ్ అల్లుఅర్జున్ సినిమానే ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు దీని పై బన్నీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశే చెందినా ..అట్లీ తో ప్లాన్ అంటే కాస్త   ఖుషీ అవుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr allu-arjun vikram

Related Articles