Telangana:రాహుల్, సోనియాకు షాక్..ఏకు మేకైన రేవంత్ రెడ్డి..?

కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీకి కొరకరాని కొయ్యలా మారిండట రేవంత్ రెడ్డి. హస్తం పార్టీ జాతీయ రాజకీయాలకు పూర్తిగా భిన్నంగా రాష్ట్రంలో రేవంత్ పాలిటిక్స్ చేస్తున్నారట. పార్టీ ఫిరాయింపులపై నేషనల్ కాంగ్రెస్


Published Sep 18, 2024 10:40:00 AM
postImages/2024-09-18/1726635589_sonia12.jpg

న్యూస్ లైన్ డెస్క్:కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీకి కొరకరాని కొయ్యలా మారిండట రేవంత్ రెడ్డి. హస్తం పార్టీ జాతీయ రాజకీయాలకు పూర్తిగా భిన్నంగా రాష్ట్రంలో రేవంత్ పాలిటిక్స్ చేస్తున్నారట. పార్టీ ఫిరాయింపులపై నేషనల్ కాంగ్రెస్ కొట్లాడుతుంటే.. రేవంత్ మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఫిరాయింపులకు పాల్పడుతున్నాడు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నాడు. బీజేపీ  బుల్డోజర్ రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనాయకులు మాట్లాడుతుంటే.. అదే కాంగ్రెస్ కు చెందిన రేవంత్ మాత్రం రాష్ట్రంలో హైడ్రా పేరుతో బుల్డోజర్లను పేద, మధ్యతరగతి నివాసాల మీదికి తోలుతున్నాడు. ఇలా...ప్రతీ దాంట్లో రేవంత్ రెడ్డి హస్తం పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారాడట.

అందుకే..ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం చీవాట్లతో సత్కరించిందట. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై సీరియస్ అయ్యిందట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో గరం గరం అయ్యిందట. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని చెప్పి ఇప్పుడు పార్టీ పరువు తీస్తున్నావంటూ చీవాట్లు పెట్టిందట. హైకోర్టు ఆదేశాలతో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, ఇప్పుడు ఏం చేస్తామని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించిందట హైకమాండ్. తెలంగాణలోని పార్టీ మార్పు వ్యవహారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు కలంకం తెస్తోందని మండిపడ్డారట.

ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రెస్ లో చేర్చుకోమని, ఒకవేళ అలా వస్తే రాజీనామా చేయించాకే తీసుకుంటామని మేనిఫేస్టోలో సైతం పెట్టామని గుర్తు చేసిందట. కానీ రేవంత్ వ్యవహారంతో అటూ రాజీనామా చేయించకపోగా ఇప్పటి వరకు కొనసాగించడం, పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తికే పీఏసీ పదవి కట్టబెట్డంపైనా ఆగ్రహం వ్యక్తం చేసిందట అధిష్టానం. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని ఇతర మంత్రులు, పార్టీ సీనియర్లతో అధిష్టానం చర్చించిందట. దీంతో వాళ్లంతా మాకేం సంబంధం లేదని తెగేసి చెప్పారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఎవరీమాట వినకుండా తమ ఇష్టానుసారంగా కండువాలు కప్పారని చెప్పారట.

అప్పటికే కాంగ్రెస్ పార్టీలో 65మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రేవంత్ రెడ్డిని అడిగినా పట్టించుకోలేదని, మేనిఫెస్టోలో పొందుపర్చినట్లుగా రాజీనామా చేయించి చేర్చుకోవాలని చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి లెక్క చేయలేదని అధిష్టానానికి వివరించారట. ఇప్పుడు పార్టీకి జరుగుతున్న డామేజ్ తో తమకెలాంటి సంబంధం లేదని సీనియర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఢిల్లీ టూర్ లో కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్లాడని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. 

బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంపైనా చర్చించిందట హైకమాండ్. బైపోల్ వస్తే ఇప్పుడు పార్టీ మారిన అభ్యర్ధులు గెలిచే అవకాశం లేదని తమ సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిందట. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు సరిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిందట. రుణమాఫీ కాక రైతులు, పెన్షన్లు పెరగక వృద్ధులు, మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం ఉందని చెప్పారట.

అంతేకాదు రైతురుణమాఫీ సభకు రాకపోవడానికి కూడా ఇదే కారణమని కుండబద్దలు కొట్టిందట. అంతేకాదు ఇదే సమయంలో హైడ్రా అంశాన్ని సైతం లేవనెత్తిందట కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో పార్టీకి ఏ ఒక్క అంశం సైతం అనుకూలంగా లేదని,  ఉప ఎన్నికలు వస్తే ఎలా గెలుస్తుందని మండిపడిందట హైకమాండ్. ఎమ్మెల్యేల చేరిక వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu brs cm-revanth-reddy rahul-gandhi congress-government runamafi

Related Articles