Ram Charan: రామ్ చరణ్ " పెద్ది " మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ !

రైటింగ్స్ లో " పెద్ది" లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని పాన్ ఇండియా మూవీని ఎవరూ ఊహించని రీతిలో అన్ కాంప్రమైజ్డ్ గా వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంట సతీస్ కిలారు నిర్మిస్తున్నారు.


Published Mar 30, 2025 10:44:00 PM
postImages/2025-03-30/1743355016_Peddi.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా " పెద్ది" మూవీ ని ఉప్పెన మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టిన బుచ్చిబాబు సానా ఈ మూవీకి డైరక్షన్ వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ లో " పెద్ది" లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని పాన్ ఇండియా మూవీని ఎవరూ ఊహించని రీతిలో అన్ కాంప్రమైజ్డ్ గా వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంట సతీస్ కిలారు నిర్మిస్తున్నారు.


 ‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుద‌లవుతుంది. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో క్రీడా మైదానం లోకి డైనమిక్ గా దూకుతున్న రామ్ చరణ్ ను చూడొచ్చు . ఈ పోస్టర్ తో గ్లింప్స్ ఎలా ఉండబోతుందని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.


‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ రాజ్‌కుమార్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు, బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ ను అందిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : ram-charan movie-news new-movie buchibabu ramcharan -glimpse bucchibabu

Related Articles