bigboss : బిగ్ బాస్ లో అభయ్ రెమ్యూనిరేషన్ ఎంతంటే ?


Published Sep 22, 2024 12:45:51 PM
postImages/2024-09-22/1727027132_07e5c792443f69f566e91c8f60e0d8271726999598028874original.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ మూడో వారం అభయ్ కు గుడ్ బై చెప్పేశాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. నిన్న నే రెడ్ కార్డు చూపించి సిధ్ధం చేసినా ..క్షమించి వదిలేశాం ..ఉండు పో అన్నారు. అయినా ఓటింగ్ తేడా కొట్టి అభయ్ కు ఎండ్ కార్డు వేసేశారు. నిజానికి అభయ్ కంటే లీస్ట్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నా బిగ్ బాస్ లో ఉంటూ బిగ్ బాస్ ను తక్కువ చేసి మాట్లాడడం అసలు సహించలేకపోయారు. నిజంగా ఓట్లు పడలేదో ..పడ్డా వీరికే నచ్చలేదో మొత్తానికి గుడ్ బై చెప్పేశారు.


బిగ్​బాస్​ తెలుగులో ఏ సీజన్​లో లేనంతగా.. బిగ్​బాస్​నే తిట్టేశాడు అభయ్ నవీన్. ఈ రీజన్​ ఎలా ఉన్నా ఓట్ల రూపంలో నవీన్​ను బయటకు పంపేందుకు బిగ్​బాస్ టీమ్​ స్క్రిప్ట్ రాసింది. బిగ్​బాస్ శనివారం కాపాడినా.. ఆదివారం మాత్రం అభయ్ నవీన్​ని బయటకు పంపేశాడు.  అయితే ఈ మూడు వారాలకు అభయ్ రెమ్యూనిరేషన్ ఎంత తీసుకున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియా టాక్.


అభయ్ నవీన్​కు బిగ్​బాస్​లో రోజుకు 28,571 రూపాయిలు కాగా.. వారానికి రెండు లక్షలని తెలిసింది. మూడు వారాలకు గానూ ఇతనికి రూ.6లక్షల రెమ్యూనిరేషన్ అందనుందని సమాచారం. థర్డ్ పేయర్ గా వచ్చిన అభయ్ మూడో వారం వెళ్లిపోయాడంటున్నారు నెటిజన్లు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigboss8 remuniration abhai

Related Articles