ఈ మూవీ లో ఉపేంద్ర ఓ సెలబ్రెటీ రోల్ లో కనిపించున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. అంతేకాదు ఉపేంద్ర ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ పోతినేని హీరోగా RAPO22 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. " మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి " సినిమాతో డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు పి ఈ సినిమా కు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ మూవీ లో ఉపేంద్ర ఓ సెలబ్రెటీ రోల్ లో కనిపించున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. అంతేకాదు ఉపేంద్ర ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది.ఈ సినిమాలో రామ్‌కు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటించనుంది. రామ్ పోతినేని ఈ మూవీలో పూర్తిగా భిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నీని , వై . రవిశంకర్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా టాప్ క్లాస్ టాలెంట్ తో రూపొందిస్తున్నారు. ఈ నెల 15న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.