ప్రతినిధులు రేవంత్‌కు స్వాగతం తెలపడానికి వెళ్లారు. కానీ, వారెవరిని లోపలికి అనుమతించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మద్దతుదారులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చారని ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఒక్క ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి తప్ప.. మిగితా అందరూ టీడీపీకి చెందిన వారు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారని NRIలు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల అమరవీరుల స్థూపం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా, తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా నడుచుకున్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా అమెరికా వెళ్లడంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు బే ఏరియా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అయితే, వాళ్లని రేవంత్ రెడ్డి బయటనే నిల్చోబెట్టి అవమానించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వంటి పలు సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులు రేవంత్‌కు స్వాగతం తెలపడానికి వెళ్లారు. కానీ, వారెవరిని లోపలికి అనుమతించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మద్దతుదారులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చారని ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఒక్క ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి తప్ప.. మిగితా అందరూ టీడీపీకి చెందిన వారు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారని NRIలు తెలిపారు.
ఉత్తర భారతదేశానికి చెందిన కొందరిని కూడా లోపలికి అనుమతించి.. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ బిడ్డలను గేటు బయటే ఆపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో తాకట్టు పెడుతున్నాడని NRIలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.