ఈ టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ జన్మదినోత్సవం సంధర్భంగా చిత్ర యూనిట్ ఈ స్పెషల్ గిఫ్ట్ ను ఫ్యాన్స్ కు అందించారు. ఈ టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
టీజర్‌లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టారని, ఆయన లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసిందని అంటున్నారు.
గతంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు సూపర్ డూపర్ హిట్. అయితే ఈ అఖ:డ కూడా హిట్ అవుతుందనే టాక్ నుడస్తుంది. ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.