హర్ష వర్ధన్ నటించిన సనమ్ మేరీ కసమ్ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఒక్కోసారి సినిమా స్టార్స్ కు భలే విచిత్రమైన పరిస్థితి వస్తుంది. సేమ్ సిట్యువేషన్ బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణే కూడా వచ్చింది. తనను చూసి ఓ ఫ్యాన్ భయంకరంగా ఏడ్వడం మొదలుపెట్టింది. మీరు నా ఫేవరేట్ అంటూ ఒకటే ఏడుపు ..ఎయిర్ హోస్టర్స్ ఎంత బతిమాలినా ఏడుపు ఆపకపోవడంతో ...ఇక చేసేది లేక హీరో హర్షనే వెళ్లి ఓదార్చాడు.
హర్ష వర్ధన్ నటించిన సనమ్ మేరీ కసమ్ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తకిట తకిట సినిమాతో హీరోగా పరిచయమైన హర్షవర్ధన్, ఆ తర్వాత నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, ‘ఫిదా’, బెంగాల్ టైగర్, అవును, అవును 2, అనామిక, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర చిత్రాలలో నటించి మెప్పించారు. ఇఫ్పుడు పూర్తిగా బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. అయితే ఫ్లైట్ లో తనని చూసిన ఓ ఫ్యాన్ ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. ఎవరు చెప్పినా కంట్రోల్ అవ్వకపోవడంతో రాణే నే వెళ్లి ఓదార్చారు.
ప్రజలు ఒకరి కోసం ఎలా ఏడుస్తారో అనుకునేదానిని.. కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.. అందుకే నేను ఏడుస్తున్నాను. మీరు నాకు చాలా ఇష్టం ...అంటూ తనమీద అభిమానాన్ని బయటపెట్టింది. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.