Taste Atlas: వరల్డ్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లో మూడు బ్రేక్ ఫాస్ట్ లు మనవే !

ప్రపంచంలోని 50 అత్యుత్తమ అల్పాహారాల జాబితాలో భారత్‌కు చెందిన మూడు ప్రఖ్యాత వంటకాలు స్థానం సంపాదించుకున్నాయి.


Published Jun 09, 2025 04:55:00 PM
postImages/2025-06-09/1749468411_bestbreakfastsoftheworldoption1430x242.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మీరు ఏమైనా చెప్పండి...భారత్ వంటకాలకు కొట్టేదే లేదు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం .. అందుకే వరల్డ్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లో మన భారతీయ వంటకాలు టాప్ లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' తాజాగా విడుదల చేసిన ఓ జాబితా ఇప్పుడు భారతీయ ఆహార ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రపంచంలోని 50 అత్యుత్తమ అల్పాహారాల జాబితాలో భారత్‌కు చెందిన మూడు ప్రఖ్యాత వంటకాలు స్థానం సంపాదించుకున్నాయి.


* మహారాష్ట్రకు చెందిన మిసల్ పావ్ 18వ స్థానంలో నిలిచింది. 


*  పరోటా 23వ స్థానాన్ని దక్కించుకుంది.


* దేశ రాజధాని ఢిల్లీ వాసుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చోలే బటూరే 32వ స్థానాన్ని కైవసం చేసుకుంది.


ఇవి టేస్టీ అండ్ హెల్దీ అని కూడా చెబుతున్నారు. అంతేకాదు భారత్ లో అన్ని రాష్ట్రాలకు ఓ ప్రత్యేక సంస్కృతి , సాంప్రదాయం కలిగి ఉంటాయి. ప్రజలు వీటితోనే తమ దినచర్యను ప్రారంభిస్తారని టేస్ట్ అట్లాస్ తన నివేదికలో ప్రశంసించింది. అంతేకాదు మిస్సైల్ పావ్ కూడా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ లో ఒకటని తేల్చింది. ఈ విస్తృత జాబితాలో నిహారి, శ్రీఖండ్, పాలక్ పనీర్ వంటి మరిన్ని భారతీయ వంటకాలు కూడా ఉండడం మరో విశేషం. అంతేకాదు మసాలా ఆమ్లెట్ , రొట్టెలు కూడా ఉన్నాయి. మిగిలిన దేశాల్లో చేసిన గుడ్లు స్పెషల్స్ కంటే భారత్ స్పెషల్స్ చాలా బాగున్నాయని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food, india tasty

Related Articles