akhil wife : అఖిల్ వైఫ్ జైనబ్ ...ఎవరో ..బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం !

ఇక 8వ తేదీన ప్రత్యేకంగా సెలెబ్రిటీలందరికీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. 


Published Jun 06, 2025 01:23:00 PM
postImages/2025-06-06/1749196550_akhilakkinenizainabravdjee311732677108.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అక్కినేని అఖిల్ కు ఈ రోజు తెల్లవారుజామునే పెళ్లి అయ్యింది. తెలుగురాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం ఎంత రిచ్చో అందరికి తెలుసు. మరి ఆ ఫ్యామిలీలోకి అడుగుపెడుతున్న జైనబ్ గురించి ఎవ్వరికి తెలీదు. అయితే ఈ పెళ్లికి ఈ గురువారం రాత్రి నుంచే పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్, శర్వానంద్ , చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక రాజ‌మౌళి త‌న‌యుడు కార్తీకేయ కూడా అఖిల్  బ‌రాత్‌లో నానా ర‌చ్చ చేశాడు. ఇక 8వ తేదీన ప్రత్యేకంగా సెలెబ్రిటీలందరికీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. 


అఖిల్‌ భార్య జైనబ్‌ రవ్‌డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలను కూడా నిర్వహిస్తుంటారు. ముంబయి ఫ్యామిలీ వీరిది. ఇండియా వైడ్ గా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. జుల్ఫీ రవ్ డ్డీ కి ఇద్దరు సంతానం . కొడుకు జైన్ , కూతురు జైనబ్ ముంబయ్ లో బాగా రిచ్. 


జైనబ్ కు కూడా ఆస్థిలో చాలా భాగముంది. మ‌రోవైపు అఖిల్‌కి కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించ‌గా, అదంతా కూడా చైతూ, అఖిల్‌ల‌కే చెందుతుంది. సో అక్కినేని అఖిల్ కు కోట్లలో  ఆస్తి కలిసివస్తున్నట్లే. అయితే అక్కినేని ఫ్యామిలీకి తగ్గ కోడలే అంటున్నారు క్లోజ్ ఫ్రెండ్స్.

newsline-whatsapp-channel
Tags : wedding akhil-akkineni wife rich

Related Articles