ravi: విడాకులే రాలేదు..అప్పుడే రెండో పెళ్లి చేసుకున్న జయంరవి !


నిజానికి విడాకుల కేసు ఇంకా తేలలేదు. తదుపరి విచారణ జూన్ 12న జరుగుతుంది.ఇదే స‌మ‌యంలో జయం రవి సైలెంట్ గా 2వ పెళ్ళి చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Published Jun 06, 2025 12:07:00 PM
postImages/2025-06-06/1749191879_Yourparagraphtext26.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జయం రవి దంప‌తుల విడాకుల గొడ‌వఅందరికి తెలిసిందే. ఈ మధ్య జయం రవి భార్య నెలకు 40 లక్షల భరణం కూడా అడిగారని అందరికి తెలిసిందే .  ఇద్ద‌రూ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌ర‌గా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. త‌మ బ్రేక‌ప్ కి కార‌ణం `మూడో వ్య‌క్తి` అంటూ ఆర్తి ర‌వి అన్నారు. అయితే సింగర్ కెనీషా తన ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన జయం రవి..ఆల్ ఆఫ్ సడన్ జయం రవి సెకండ్ పెళ్లి చేసుకున్నారంటూ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


నిజానికి విడాకుల కేసు ఇంకా తేలలేదు. తదుపరి విచారణ జూన్ 12న జరుగుతుంది.ఇదే స‌మ‌యంలో జయం రవి సైలెంట్ గా 2వ పెళ్ళి చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కెనీషా ఫ్రాన్సిస్, జయం రవి..మేడలో పూల దండలు వేసుకొని ఫొటోల‌కి పోజులు ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేయించుకున్నారో లేక పెళ్లే చేసుకున్నారో తెలీదు కాని ఇలా గుళ్లో పూల దండలతో , పండితుల మధ్య కనిపించేసరికి రెండో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. జూన్ 12న వీరి విడాకుల విష‌యంలో ఓ క్లారిటీ అయితే వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news jayam-ravi jayam-ravi-divorce

Related Articles