మీ పిల్లల్ని చిన్న ఏజ్ లో స్కూల్లో జాయిన్ చేస్తున్నారా..డేంజర్.!

ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా తొందరగా స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా మూడేళ్లు నిండుతాయో నిండఓ అప్పుడే స్కూల్ బాట పట్టిస్తారు.  కనీసం ఆ పిల్లలకి తినడం కూడా రాదు  అయినా నాలుగు గోడల మధ్య బంధించే స్కూల్లోకి పంపి  మా అబ్బాయి లేదా అమ్మాయి స్కూలుకు వెళుతుందని విపరీతంగా సంబరపడతారు. అలా చిన్న వయసులోనే పిల్లల్ని స్కూలుకు పంపే తల్లిదండ్రులు తప్పక కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-12/1720752355_child.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా తొందరగా స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా మూడేళ్లు నిండుతాయో నిండఓ అప్పుడే స్కూల్ బాట పట్టిస్తారు.  కనీసం ఆ పిల్లలకి తినడం కూడా రాదు  అయినా నాలుగు గోడల మధ్య బంధించే స్కూల్లోకి పంపి  మా అబ్బాయి లేదా అమ్మాయి స్కూలుకు వెళుతుందని విపరీతంగా సంబరపడతారు. అలా చిన్న వయసులోనే పిల్లల్ని స్కూలుకు పంపే తల్లిదండ్రులు తప్పక కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.  

వారిని చిన్న వయసులో పంపడం వల్ల లాభాలేమో కానీ నష్టాలే  కలుగుతాయట. చదువుకుంటే నష్టాలు రావడం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదూ..  అవునండి వారు కాస్త పెద్దాయిన తర్వాత కొన్ని విషయాల్లో వెనుకబడిపోతారని నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా ఒక అబ్బాయి లేదా అమ్మాయి 5 ఇయర్స్ ఉందనుకోండి. తొందరపడి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం.

ఈ టైంలో ఆమె 6 ఇయర్స్ వచ్చేవరకు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకోవాలో, 5 ఇయర్స్ సమయంలోనే మనం అందించగలుగుతున్నాం. అలా అమ్మాయి/అబ్బాయి వయసు తక్కువ చదువు ఎక్కువ అవుతుంది. ఆమె మెచ్యూరిటీకి తగ్గట్టుగా చదువు ఉండదు..  ఆ స్టడీ బర్డెన్ అవుతుందట.  ప్రతి ఇయర్ వాళ్ళు ముందుకు వెళ్లినాకొద్దీ బర్డెన్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే వయసు కన్నా ఎక్కువ క్లాసులో ఉండడం డేంజరస్ అని నిపుణులు అంటున్నారు. వయసు కన్నా చదువు  ఎక్కువగా ఉంటే ఈ ఏజ్ లో ఏం కాదట. కానీ ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసిన సమయంలో  ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్లకి మెచ్యూరిటీగా ఆలోచించే శక్తి ఉంటుంది.

దీనివల్ల ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఏజ్ కాస్త ఎక్కువగా ఉండి మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులే సక్సెస్ అవుతారు. తక్కువ వయసు ఉన్న వ్యక్తులు రాసినప్పుడు మెచ్యూరిటీగా ఆలోచించలేరు. ఏదో బట్టీ పట్టి చదివింది గుర్తుంటే తప్ప  మెచ్యూరిటీగా ఆలోచించి  ఆ కాంపిటీటివ్ లో నెగ్గలేరు.  కాబట్టి వయసు ఎక్కువగా ఉండి చదువు తక్కువగా ఉన్న పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ, చదువు ఎక్కువగా ఉండి వయసు తక్కువగా ఉంటే మాత్రం వాళ్ళపై తప్పనిసరిగా బర్త్డేన్ పడుతుందనేది తల్లిదండ్రులు గమనించాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu childrens school low-age comptetive-exams

Related Articles