ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్ , పిక్స్ , రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రీ టీజర్ ప్రీ టీజర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ..కొత్త డైరక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నరసన కథానాయికగా సాయి మంజ్రేకర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్ , పిక్స్ , రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రీ టీజర్ ప్రీ టీజర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఇక టీజర్ లో విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా ...ఆమె కొడుకు క్యారక్టర్ లో కళ్యాణ్ రామ్ కనిపించారు. నెక్స్ట్ పుట్టిన రోజు నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కుమారుడిని కోరుతుంది.అనుకున్నట్లుగా హీరో పోలీస్ కాకుండా కత్తిపట్టి రౌడీల మీద యుధ్దానికి బయలుదేరినట్లు టీజర్ లో చూపించారు. తల్లి కొడుకుల వైరం , ప్రేమ సెంటిమెంట్ నేపథ్యంలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు.