Karimnagar: కరీంనగర్ లో భూప్రకంపనలు ...భయాందోళనలో జనాలు !

కొద్ది సెకన్ల పాటుభూమి  కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు.


Published May 05, 2025 07:57:00 PM
postImages/2025-05-05/1746455408_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల , జగిత్యాల, నిర్మల్ , పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భూయందోళనలకు గురయ్యారు. కొద్ది సెకన్ల పాటుభూమి  కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు.ఎక్కువ శాతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాల్లోని చాలా చోట్ల భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కొందరు స్థానికులు తెలిపారు. భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karimnagar telangana earth-quake

Related Articles