వెట్రిమారన్ బ్యానర్ లో వస్తున్న " మండాడి" లో సుహాస్ ఓ మెయిన్ క్యారక్టర్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :వెట్రిమారన్ మూవీస్ అనగానే క్రేజీ స్క్రిప్ట్ అని అందరికి తెలిసిందే. అయితే వెట్రిమారన్ తో మూవీ చెయ్యడానికి బడా హీరోస్ చాలా మంది క్యూలో ఉంటారు. అలాంటి ఛాన్స్ కొట్టేశాడు సుహాస్ . వెట్రిమారన్ బ్యానర్ లో వస్తున్న " మండాడి" లో సుహాస్ ఓ మెయిన్ క్యారక్టర్ చేశారు.
ఈ మూవీ తెలుగు ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఇందులో సుహాస్ వైల్డ్ లుక్‌లో చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు. వెట్రిమారన్ స్టైల్ లో సాగే రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. తమిళంలో సుహాస్ కు ఓ రకంగా మంచి బిగినింగ్ అనుకోవాలి. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయంట . అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని మూవీ టీం చెబుతుంది.
ఈ మూవీ లో తమిళ్ యాక్టర్ సూరి కూడా యాక్ట్ చేస్తున్నారు. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్. అలాగే సత్యరాజ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ బాణీలు అందిస్తున్నారు.