Supplements : మీ వయసు 30 దాటితే మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది !

దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ, ఇది అందరికీ అవసరం లేదు.


Published May 03, 2025 09:21:00 PM
postImages/2025-05-03/1746287490_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముప్పై దాటితే ఓ ముఖ్యమైన దశ. అటు మీరు యంగ్ కాదు ..ముసలి కాదు కాని అన్ని ఇబ్బందులు మీకే అన్నట్లుంటారు.చిన్న చిన్న మార్పులే కాని చాలా పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడతాయి. కాబట్టి కొన్ని రకాల సప్లమెంట్స్ వాడడం వల్ల మీరు మరింత హెల్దీగా ఉంటారు. అయితే ఈ సప్లమెంట్స్ డాక్టర్స్ సలహా తో వాడడం చాలా మంచిది. 


30 ల్లోకి వచ్చాక హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జీవక్రియ సరిగ్గా పనిచేయదు. ఆహారం ద్వారా అన్ని పోషకాలు అందనప్పుడు, సరైన సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చు మరియు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ, ఇది అందరికీ అవసరం లేదు. అయితే సప్లమెంట్స్ తీసుకునేముందు ఓ సారి ఫుల్ బాడీ చెకప్ చాలా అవసరం. డాక్టర్ కు చూపించుకొని మీరు తీసుకోవాలనుకుంటున్న సప్లమెంట్స్ తీసుకోవచ్చా లేదా ట్రై చెయ్యాలి. స్నేహితులు చెప్పారనో, ప్రకటనలు చూశామనో వాడటం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ సజిషన్ అవసరం.


* మల్టీవిటమిన్లు: బిజీ లైఫ్‌స్టైల్ వల్ల ఆహారంలో లోపించే విటమిన్లు, ఖనిజాలను భర్తీ చేయడానికి ఉపయోగపడతాయి. కాని అవసరం లేకుండా వాడితే కీళ్ల వ్యాధులు వస్తాయి.


* కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం. కానీ, దీని శోషణకు విటమిన్ D3, K2 అవసరం. ఆహారంలోని కాల్షియం ఉత్తమం. సాధారణంగా డాక్టర్లు కాల్షియం సప్లమెంట్స్ రాస్తూ ఉంటారు.


* విటమిన్ సి: రోగనిరోధక శక్తికి, చర్మానికి మంచిది. పొద్దున్న టిఫెన్ అయ్యాక తీసుకుంటే చాలా మంచిది.


* ఐరన్: శక్తి ఉత్పత్తికి కీలకం. కానీ, ఐరన్ లోపం ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయ్యాకే, వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. అధిక మోతాదు చాలా డేంజర్.


* ప్రోటీన్ పౌడర్: కండరాల బలానికి తోడ్పడుతుంది. ఆహారం ద్వారా తగినంత ప్రోటీన్ తీసుకోలేని వారు పరిగణించవచ్చు.


* బయోటిన్: జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి ఇది అవసరమనే ప్రచారం ఉంది, కానీ బయోటిన్ లోపం ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఈ బయోటిన్ ను డాక్టర్ సాయంతో తీసుకుంటే చాలా మంచిది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health vitamin-ab

Related Articles