ఒక్కరోజులో రూ.1000 సంపాదిస్తే.. ఫ్రీ బస్సు కారణంగా రూ.500 మాత్రమే వస్తున్నాయని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటికే 30 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ఫైనాన్స్ లు కట్టలేక పోతున్నామని, ఫైనాన్స్ అధికారుల వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. AITUC అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అసెంబ్లీ వద్దకు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ ఆటో డ్రైవర్లు AITUC ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
ఫ్రీ బస్సుల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. తాము ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మహిళలకు ఫ్రీ బస్సు తీసుకొచ్చి ప్రభుత్వం తమ పొట్టన కొడుతోందని అన్నారు. దీని కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు.
గతంలో ఒక్కరోజులో రూ.1000 సంపాదిస్తే.. ఫ్రీ బస్సు కారణంగా రూ.500 మాత్రమే వస్తున్నాయని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటికే 30 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ఫైనాన్స్ లు కట్టలేక పోతున్నామని, ఫైనాన్స్ అధికారుల వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు.
ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చిలాని డిమాండ్ చేశారు. అయితే, అసెంబ్లీ వద్దకు వెళ్లిన ఆటో డ్రైవర్లను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.