ఈమధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లి విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు. కేవలం మూడు ముళ్ళు వేయగానే పెళ్లి కాదు రెండు మనసులు కలిసి అన్ని రకాలుగా సాటిస్ఫై అయితే పెళ్లైనట్టే అని భావిస్తూ ఉన్నారు. కొంతమంది పెళ్లికి ముందే గర్భం దాలుస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్క విధమైనటువంటి అభిరుచితో ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రూట్ లోనే అవికా గోర్ కూడా నడుస్తోంది. ఆమె ఒక వ్యక్తిని ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని చెప్పకనే చెప్పేసింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: ఈమధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లి విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు. కేవలం మూడు ముళ్ళు వేయగానే పెళ్లి కాదు రెండు మనసులు కలిసి అన్ని రకాలుగా సాటిస్ఫై అయితే పెళ్లైనట్టే అని భావిస్తూ ఉన్నారు. కొంతమంది పెళ్లికి ముందే గర్భం దాలుస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్క విధమైనటువంటి అభిరుచితో ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రూట్ లోనే అవికా గోర్ కూడా నడుస్తోంది. ఆమె ఒక వ్యక్తిని ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని చెప్పకనే చెప్పేసింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది హీరోయిన్ అవికా గోరు మాత్రమే. ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ పొందినటువంటి ఈ ముద్దుగుమ్మ ఉయ్యాల జంపాల అనే చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది. ఈమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా హీరో నాగార్జున అని చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే హిట్ సాధించి అందరి దృష్టిలో పడ్డది ఈ బ్యూటీ. ఈ సినిమాల తర్వాత ఒకానొక సమయంలో చాలా బొద్దుగా తయారై హీరోయిన్ పాత్రల నుంచి ఫెయిడౌట్ అయిపోయింది.
ఆ తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకొని ఎన్నో కసరత్తులు చేసి అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ సాధించింది. అలాంటి అవికాగోర్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమె "బ్లడీ ఇష్క్" అనే కొత్త మూవీతో మన ముందుకు రాబోతోంది. పూర్తిగా ప్రేమతో కూడిన కథ కాబట్టి ఈ సినిమా గురించి చెప్పడమే కాకుండా తన సొంత జీవితంలో లవ్ గురించి కూడా ఓపెన్ అయింది. అయితే అవికా మీలాంద్ చాంద్వాని వ్యక్తితో గడుపుతోంది. అయితే ఆయన గురించి అవికాగోరు పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.
మేమిద్దరం కామన్ ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమని, అలా ఆరు నెలల తర్వాత మిలంద్ నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడు. అతనంటే నాకు కూడా ఇష్టం పెరిగింది దీంతో నేను యాక్సెప్ట్ చేశాను. అలా మా ఇద్దరి మధ్య మొదటిసారి ప్రేమ చిగురించింది. నిజం చెప్పాలంటే మా దృష్టిలో మా ఇద్దరి పెళ్లి ఎప్పుడో జరిగింది. అన్ని రకాలుగా మేం కలిసిపోయాం. పెళ్లి అనేది జీవితంలో ఒక పెద్ద పరిణామం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం. దానికి మీలాంద్ కూడా ఒప్పుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవికా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.