దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన తమపై తిరుపతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఓ మహిళా జర్నలిస్ట్ వాపోయారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల జర్నలిస్టులు, మహిళా రెపోరేటర్లపై జరిగిన దాడి ఘటనలు మరువక ముందే మరో మహిళా జర్నలిస్ట్‌పై దాడి యత్నం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా అజర్నలిస్టులపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. అదే రోజున ఆ వార్త వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన జర్నలిస్ట్ శంకర్‌పై కూడా హత్యాయత్నం జరిగింది. దీంతో తమకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతోందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరుస ఘటనలు మరువకముందే.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని ఓ మహిళా జర్నలిస్ట్ వాపోయింది. తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు FTL పరిధిలో ఉండడంతో హైడ్రా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన తమపై తిరుపతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఓ మహిళా జర్నలిస్ట్ వాపోయారు.
కెమెరాను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించారని.. ఇక్కడ వీడియోలు రికార్డ్ చేయకూడదని హెచ్చరించారని ఆమె వెల్లడించారు. మీడియాపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. దుర్గం చెరువు FTL పరిధిలో అక్రమ కట్టడం నిర్మించారని చూపిస్తున్నందుకు తనతో పాటు, కెమెరా పర్సన్‌పై తిరుపతి రెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు.