హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది.
ప్యాకేజీ -1 కింద హరిద్వార్ , రిషికేశ్ , వైష్ణోదేవిని సందర్మించవచ్చు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ లో అత్యధ్భుతమైన ప్రదేశం. చూడ్డానికి చాలా ప్లేసులు ఉన్నాయి. ఎన్నో హిస్టోరికల్ ప్లేసులు ..ఫన్ క్రియేట్ చేసే ప్రదేశాలు...బుధ్ధివికసించే ఎన్నో మాన్యెమెంట్స్ చాలా ఉన్నాయి. అయితే పిల్లలకు సెలవులు దొరికేదే వేసవిలో ..ఎండాకాలం ఎండలకు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి కంఫర్ట్ చూసుకుంటూ మన బడ్జెట్ లో చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసేవారికి ఇండియన్ రైల్వే బెస్ట్ టూర్ ను ప్లాన్ చేసింది. . హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది.
ప్యాకేజీ -1 కింద హరిద్వార్ , రిషికేశ్ , వైష్ణోదేవిని సందర్మించవచ్చు. దీని విలువ రూ. 18,510 గా నిర్ణయించింది. ఏప్రిల్ 23 వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు అంటే పదిరోజుల పాటు టూర్ సాగనుంది. ఇందులో హరిద్వార్ , రిషికేశ్ , ఆనందపూర్ , నైనా దేవి, అమృతసర్ , మాతా వైష్ణో దేవి దేవాలయాలు కవర్ కానున్నాయి. ప్యాకేజీ .2 నుంచి కాశీ, గయా , ప్రయాగ , అయోధ్య , వెళ్లొచ్చు. మే 8వ తేదీ నుంచి 17 వతేదీ వరకు సాగే ఈ టూర్ ప్యాకేజీ విలువ రూ. 16,800 గా రైల్వే శాఖ నిర్ణయించింది.
ప్యాకేజీ -3 కింద అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ప్రదేశాలు కవర్ కానున్నాయి. మే 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇందుకోసం రైల్వేశాఖ రూ.14,700గా నిర్ణయించింది.
ప్యాకేజీ -4 కింద పంచ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా మహాకాళేశ్వర్ , ఓం కారేశ్వర్ . త్రయంబకేశ్వర్ , భీం శంకర్ ,గృష్ణేశ్వర్ ,ఎల్లోరా మోవ్ , నాగ్ పూర్ ప్రదేశాలు కవర్ అవుతాయి, జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇందుకు గాను ప్యాకేజీని రైల్వే శాఖ రూ.14,700గా నిర్ణయించింది. మరికొన్ని వివరాలు రైల్వే ఆన్ లైన్ వెబ్ లో చూసుకోవచ్చని తెలిపింది.