ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పనితీరు బాగోకపోతే...జీతం తగ్గించేవాళ్లని...లేదా ఉద్యోగం నుంచి తీసేసే వాళ్లని చూసి ఉంటాం. కాని ఉద్యోగులను కుక్క గొలుసులతో కట్టి మోకాళ్లపై నడిపించే సీన్స్ చాలా తక్కువ చూసి ఉండం ..ఇలాంటి సంఘటన కేరళ లో జరిగింది. కేరళలోని కలూర్‌కు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది. నేల పై కాయిన్స్ పడేసి ..నాలుకతో తీయించడం ...బట్టలు విప్పించి..వారిని అందరు లెంపకాయలు కొట్టడం...లేదా కుక్క బెల్ట్ కట్టి మోకాళ్లపై కుక్కలా నడిపించడం లాంటి శిక్షలు వేస్తున్నారు. అంతేకాదు టార్గెట్ రీచ్ అవ్వకపోతే మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చెబుతున్నారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన కేరళ కార్మికశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి ఆ కంపెనీపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫుటేజీ లో కనిపించిన వ్యక్తితో అధికారులు మాట్లాడారు. అయితే అది చాలా పాత వీడియో అని ..పాత మేనేజర్ ఉన్నపుడు ఇలాంటివి చేసేవారని ఇప్పుడు యాజమాన్యం అతనిని తొలగించిందని తెలిపారు. అయితే మరికొందరు ఉద్యోగులు మాత్రం టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇప్పటికి ఇదే శిక్షలు అని తెలిపారు.సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండించినట్టు పోలీసులు తెలిపారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Modern day slavery
![]()
Tags : news-line kerala harrasment