‘హౌసింగ్ రాకెట్’ను అంతమొందించాలని, ఇంటి యజమానులే దోషులని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని నిరసనకారులు నినాదాలు చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : స్పెయిన్ లో జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. స్పెయిన్ లో ఇళ్ల అద్దెలు భరించలేకపోతున్నాం....వచ్చే జీతాలన్ని దీనికే పోతున్నాయి, కాస్త రెంట్లు పెంచేస్తున్న ఓనర్లపై ప్రభుత్వం మాట్లాడాల్సిందేనంటు ప్రజలు నిరసనలు చేపట్టారు.మాడ్రిడ్‌లో జరిగిన నిరసనల్లో దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా 40 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పుడున్న రెంట్లకు దాదాపు 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు.
‘హౌసింగ్ రాకెట్’ను అంతమొందించాలని, ఇంటి యజమానులే దోషులని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. కాటలాన్ తీర ప్రాంత పట్టణాల్లో పెరిగిపోతున్న అద్దెలపై సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ‘ఇంటి వ్యాపారం ముగింపునకు ఇది నాంది’ అని పేర్కొన్నారు. సొంత ఇళ్లు లేనివారికి ..ఈ ఓనర్లు ఓ పరాన్న జీవుల్లా తయారయ్యారని మెరుగైన జీవిన విధానానికి ఇది నాంది కావాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాడ్రిడ్‌లో కనీసం 15 వేల టూరిస్ట్ అపార్ట్‌మెంట్లు అనధికారికంగా నడుస్తున్నాయి. 30 ఏళ్ల లోపు ఉన్న యూత్ 85 శాతం మంది ఇప్పటికి పేరెంట్స్ తో ఉంటున్నారు. దీనికి ఇళ్ల అద్దెలు భరించలేక అని తెలిపారు. నిరవధిక లీజులు ఇవ్వాలని, ఆస్తి ఊహాగానాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.