Bahishkarana : అంజలి ..బహిష్కరణ సీరిస్ రివ్యూ..అంజలి మరీ ఇంత బోల్డ్ గా ?

తెలుగమ్మాయి అంజలి మెయిన్ లీడ్ గా చేసిన వెబ్ సీరిస్ ఈ " బహిష్కరణ" ఇందులో రవీంద్ర విజయ్ , అనన్యా నాగళ్ల , శ్రీతేజ్ లాంటి వారు ప్రధాన పాత్రదారులు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో జీ 5 లో రిలీజ్ అయ్యింది. ఓటీటీ రిలీజ్ . ఈ మూవీలో అంజలి ఓ వేశ్య పాత్ర  ఎక్స్‌క్లూజివ్ రివేంజ్ డ్రామా, బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. ఆరు ఎపిసోడ్స్ .


Published Jul 19, 2024 03:57:00 PM
postImages/2024-07-19/1721384899_ANJALI.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగమ్మాయి అంజలి మెయిన్ లీడ్ గా చేసిన వెబ్ సీరిస్ ఈ " బహిష్కరణ" ఇందులో రవీంద్ర విజయ్ , అనన్యా నాగళ్ల , శ్రీతేజ్ లాంటి వారు ప్రధాన పాత్రదారులు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో జీ 5 లో రిలీజ్ అయ్యింది. ఓటీటీ రిలీజ్ . ఈ మూవీలో అంజలి ఓ వేశ్య పాత్ర  ఎక్స్‌క్లూజివ్ రివేంజ్ డ్రామా, బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. ఆరు ఎపిసోడ్స్ .


పెద్దపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల పది ఊళ్లకు ప్రెసిడెంట్ శివయ్య (రవీంద్ర విజయ్) మాట శాసనం. ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంది పుష్ప (అంజలి). ఆమె ఓ వేశ్య. పుష్ప అందచందాలకు ముగ్ధుడైన శివయ్య ఊరి చివర ఇంట్లో ఉంచుతాడు. తన అవసరాలన్నీ చూసుకుంటాడు. ఊరందరి కన్ను పుష్ప మీదే ఉ:టుంది. శివయ్యకు కుడి భుజం లాంటి దర్శి (శ్రీతేజ్) చూపించిన ప్రేమకు  ఆమె పడిపోతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. శివయ్య కూడా ఒప్పుకుంటాడు .


సిటీకి షాపింగ్ వచ్చిన ....దర్శికి శివయ్య షాక్ ఇస్తాడు. లక్ష్మి (అనన్యా నాగళ్ల) మెడలో తాళి కట్టమని చెబుతాడు.  లక్ష్మి  దర్శి మరదలే. అసలు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ..ఇలా ఎందుకు చేశాడు..అసలు దర్శి ఎందుకు మరదల్ని పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత దర్శి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఊరిలో దర్శి వర్గానికి చెందిన అమ్మాయిల మరణాలకు కారణం ఎవరు? లక్ష్మిని దర్శి పెళ్లి చేసుకున్నాక పుష్ప ఏం చేసింది? జైలు నుంచి వచ్చాక దర్శి ఏం చేశాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


'బహిష్కరణ' కథ కొత్తగా ఉందని చెప్పలేం. కానీ, కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠతో, ఆసక్తిగా ఎదురు చూసేలా ఉందని చెప్పడంలో ఏం సందేహం అవసరం లేదు. కొన్ని సీన్లు మరీ ...రా అండ్ రస్టిక్ ఫీల్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పలు సన్నివేశాల్లో అంతర్లీనంగా ఆయన కొన్ని విషయాలు చెప్పిన తీరు బావుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనుషులు చేపల్ని వేటాడినట్టు బలవంతులు బలహీనులను వేటాడుతున్నారని చూపించే విధానం చాలా బాగుంది. దర్శకుడు టాలెంటెడ్ అని అర్ధమవుతుంది.'బహిష్కరణ'ను దర్శకుడు ముఖేష్ ప్రజాపతి కమర్షియల్ ప్యాకేజ్ రూపంలో ఓటీటీ ఆడియన్స్ ముందుకు తెచ్చారు.  నో డౌట్ వెబ్ సీరిస్ మీ టైంను వేస్ట్ చెయ్యదు. హ్యాపీ గా  బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. ఎంజాయ్ చెయ్యండి. అన్నట్లు అంజలి చంపేసింది పర్ఫామెన్స్ తో ఇరగదీసేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries anjali review

Related Articles