Bharateeyudu-2: భారతీయుడు-2 ఫ్లాప్.. భయపడుతున్న మెగా ఫ్యాన్స్..?

భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 మూవీ ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.996లో వచ్చిన భారతీయుడు సినిమా ప్రేక్షకుల్లో ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమాని పిచ్చిగా ప్రేమించిన కొంతమంది అభిమానులైతే భారతీయుడు -2 సినిమా చూసి శంకర్ ను తిట్టుకోకుండా ఉండలేరు. అయితే భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అందరు భయపడిపోతున్నారు.ఎందుకంటే చాలామంది భారతీయుడు 2 సినిమాని గేమ్ చేంజర్ సినిమాని ఒకేసారి షూటింగ్ చేయడం వల్ల సినిమాపై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు అని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయుడు -2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో గేమ్  చేంజర్ సినిమా ఎలా ఉండబోతుందోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


Published Jul 12, 2024 06:30:00 PM
postImages/2024-07-12/1720787491_kamalhaasan.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 మూవీ ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా చూసిన జనాలు అంతా అసలు ఈ సినిమాకి టికెట్లు ఎందుకు బుక్ చేసుకున్నాం రా నాయనా అని గగ్గోలు పెట్టుకునే అంత స్టేజ్ కి వచ్చారట.అంతేకాదు 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ప్రేక్షకుల్లో ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమాని పిచ్చిగా ప్రేమించిన కొంతమంది అభిమానులైతే భారతీయుడు -2 సినిమా చూసి శంకర్ ను తిట్టుకోకుండా ఉండలేరు. ఎందుకంటే భారతీయుడు సినిమాని అంత బాగా తెరకెక్కించి భారతీయుడు -2 సినిమాలో సేనాపతి కమల్ హాసన్ ని విలన్ గా చూపిస్తూ సినిమా తెరకెక్కించిన తీరు అందర్నీ షాకింగ్ కి గురి చేసింది.

అంతేకాదు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్,డిజాస్టర్ అంటూ సినిమా చూసిన జనాలు రివ్యూ ఇస్తుంటే భారతీయుడు మూవీ అభిమానులు అయితే కాస్త నిరాశ పడుతున్నారు. అయితే భారతీయుడు సినిమా రేంజ్ లోనే ఉంటుంది అని భారతీయుడు 2 సినిమా చూడడానికి వెళ్ళిన జనాలందరూ నిరాశ పడుతున్నారు. ఈ సినిమాలో ఒక్కటి కూడా వహ్ వా..ఈ సీన్ చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. ఒక్క ఎమోషన్ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వలేదు.అసలు భారతీయుడు సినిమా కి సీక్వెల్ తీసినందుకు శంకర్ తన సినిమా ఇమేజ్ ని దెబ్బ తీసుకున్నారు అని చాలామంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.దీనికి తోడు భారతీయుడు -2 చివర్లో భారతీయుడు -3 సీక్వెల్ కూడా ఉంటుంది అని అనౌన్స్ చేశారు.

దీంతో ఈ సినిమా చూసిన జనాలు అందరూ భారతీయుడు 2 సినిమా చూసే తప్పు చేసాం. ఇక దీనికి సీక్వెల్ గా వచ్చే సినిమా చూడడానికి ఎవరైనా సాహసం చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు పెద్ద సహన పరీక్ష పెట్టినట్టు అయిపోయింది. దాంతో సినిమా చూసి బయటికి వచ్చిన జనాలందరూ ఇచ్చే రివ్యూలకి నెక్స్ట్ సినిమా చూడ్డానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు అలాంటి టాక్ ని తెచ్చుకుంది. అయితే భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అందరు భయపడిపోతున్నారు.ఎందుకంటే చాలామంది భారతీయుడు 2 సినిమాని గేమ్ చేంజర్ సినిమాని ఒకేసారి షూటింగ్ చేయడం వల్ల సినిమాపై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు అని మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే భారతీయుడు -2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో గేమ్  చేంజర్ సినిమా ఎలా ఉండబోతుందోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.అంతేకాదు ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు తీసిన శంకర్ సినీ కెరియర్ లో ఇదే అత్యంత చెత్త సినిమా అని నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు శంకర్ సినీ కెరియర్ లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ భారతీయుడు 2 సినిమా అంతా చెత్త సినిమా మాత్రం లేదు అని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతీయుడు 2 సినిమా మాత్రం అభిమానులను నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan bharateeyudu-2 shankar bharateeyudu game-changer

Related Articles