అయితే, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్ వారి ఫేమ్, పాపులారిటీని బట్టి ఉంటుంది. అయితే అది రూ. 2నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరొక్క రోజు బిగ్ బాస్ వచ్చేస్తుంది. కంటెస్టెంట్స్ ఎవరు..ఎంత బ్యూటీస్ ...ఎవరు జనాలకు తెలుసు..ఎవరికి ఎంత రెమ్యూనిరేషన్ అబ్బో సవాలక్ష ప్రశ్నలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. అసలు వారి రెమ్యూనిరేషన్లు ఎలా ఇస్తారో తెలిస్తే షాక్ అయిపోతారు. జస్ట్ 15 వేలకే బిగ్ బాస్ కు వెళ్తారు కంటెస్టెంట్స్ . అయితే ఫేమ్ ను బట్టే ఇక్కడ మనీ మ్యాటర్ నడుస్తుంది. తక్కువ రెమ్యూనిరేషనే కదా అంటారేమో ..తక్కువే కాని ఫేమ్ వస్తుందిగా. కొత్తగా ఇండస్ట్రీలో అడుగులు వేయాలనుకునేవారికి బిగ్ బాస్ చాలా మంచి అవకాశం. అయితే కాస్త ఫేమ్ ఉన్నవారికి మాత్రం రెమ్యూనిరేషన్ మరోలా ఉంటుంది.
అయితే, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్ వారి ఫేమ్, పాపులారిటీని బట్టి ఉంటుంది. అయితే అది రూ. 2నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న హీరో శివాజీకి వారానికి రూ. 4.5 రెమ్యూనిరేషన్ అందుకున్నారని టాక్. ఇక వారు ఎన్ని వారాలు ఉంటారనేది వాళ్ల ఆట మీద ఆధారపడి ఉంటుంది.
ఇక సాధారణ యూట్యూబర్లు , ఫేమ్ పెద్దగా లేనివాళ్లకి మాత్రం చాలా తక్కువ . లాస్ట్ సీజన్ లో రైతు బిడ్డకు అదే పల్లవి ప్రశాంత్ కు వారానికి లక్ష ఇచ్చారని టాక్. అలా స్థాయిని బట్టే రెమ్యూనిరేషన్. ఇది రెమ్యూనిరేషన్ ప్రక్రియ అన్ని సార్లు ఒకేలా ఉండాలని లేదు. ప్రతి సీజన్ కు కొత్త రూల్స్ కాని మరీ చిన్న యూట్యూబర్స్ ...మరీ తెలుగు రాష్ట్రాలకు కొత్త వాళ్లకి మాత్రం 15వేల కంటే ఎక్కువ చెల్లించడం లేదని టాక్.
ఈ సీజన్‌కు మేకర్స్ పెట్టే బడ్జెట్‌ను పెట్టి దీనిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇండస్ట్రీ లో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. కొంత మంది సూపర్ డూపర్ క్రేజ్ కొట్టారు. రాహుల్ సిప్లిగంజ్‌కు చాలా ఫేమ్ వచ్చింది. శివబాలాజీ టైటిల్ విన్నర్ కాని పెద్దగా ఫేమ్ రాలేదు. అలా ఏ సెకన్ ఏమవుతుందో అంతా సస్పెన్సే...జస్ట్ చూసి చిల్ అవ్వాలంతే.