BIGG BOSS 8: బిగ్ బాస్ చెత్త షో...విష్ణుప్రియ పాత వీడియో వైర‌ల్..!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మెప్పించ‌లేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో యాంక‌ర్ విష్ణు ప్రియ ఒకరు. ఈటీవీ టీవీ షోల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన విష్ణుప్రియ‌కు యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ అమ్మ‌డి ప్రోగ్రాంల కంటే సోష‌ల్ మీడియా పోస్టుల‌కే ఎక్క‌వ‌ మంది అభిమానులు ఉన్నారు. త‌రచూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోల‌తో, జిమ్ వీడియోల‌తో విష్ణు ప్రియ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతూ ఉంటుంది.


Published Sep 07, 2024 05:06:49 PM
postImages/2024-09-07/1725709009_Untitleddesign7.jpg

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మెప్పించ‌లేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో యాంక‌ర్ విష్ణు ప్రియ ఒకరు. ఈటీవీ టీవీ షోల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన విష్ణుప్రియ‌కు యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ అమ్మ‌డి ప్రోగ్రాంల కంటే సోష‌ల్ మీడియా పోస్టుల‌కే ఎక్క‌వ‌ మంది అభిమానులు ఉన్నారు. త‌రచూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోల‌తో, జిమ్ వీడియోల‌తో విష్ణు ప్రియ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే విష్ణు ప్రియ ప్ర‌స్తుతం బిగ్ బాస్ లో ఉంది కానీ ఒక‌ప్పుడు బిగ్ బాస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ రిపోర్ట‌ర్ మీరు బిగ్ బాస్ లోకి వెళుతున్నారంట నిజ‌మేనా..? అని ప్ర‌శ్నించ‌గా విష్ణు ప్రియ స‌మాధానం ఇస్తూ....నా జీవితంలో ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ల‌ను అని చెప్పింది. ప్ర‌పంచం అంతా బ‌య‌టే ఉంటే ఇంట్లో ఉండి ఏం చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. మీ ఇంట్లో వాళ్లు ఉన్నారు...వాళ్ల‌ను చూసుకోవాలి అలాంటప్పుడు బిగ్ బాస్ లో ఎందుకు ఉండాల‌ని అడిగింది.

అస‌లు బిగ్ బాస్ ను తాను ఎంక‌రేజ్ చేయ‌ను అని, ఎప్పుడూ చూడ‌లేద‌ని పేర్కొంది. అక్క‌డ కొట్టుకోవ‌డం ఎక్కువ ఉంటుంది...బిగ్ బాస్ లో ఎలిమినేష‌న్ ఉంటుంది. నేను ఎవ్వ‌రినీ ఎలిమినేట్ చేయ‌ను..జీవితంలో కూడా ఎప్పుడూ ఎలిమినేట్ చేయ‌లేదు అని చెప్పింది. వీలైతే ప్రేమించాలి కానీ ఎలిమినేట్ చేయ‌కూడ‌ద‌ని గొప్ప‌లు చెప్పింది. రాసి పెట్టుకోండి నేను ఎప్పుడూ బిగ్ బాస్ కు వెళ్ల‌ను. ఒక‌వేళ వెళితే మీరే న‌న్ను బ్లేమ్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక అప్పుడు అలాంటి కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

newsline-whatsapp-channel
Tags : bigg-boss-8

Related Articles