తన భర్త మోసిన్ అక్తర్ మీర్ తో తన తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగించుకోవాలని ఊర్మిళ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళ విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యిందట. దీని కోసం మీడియాలోను ...ఫిల్మ్ వర్గాల్లో చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్ తో తన తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగించుకోవాలని ఊర్మిళ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది .
ఊర్మిళ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కానీ నాలుగు నెలల క్రితమే ఊర్మిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. అంతేకాదు ఊర్మిళ... తన కంటే పదేళ్ల చిన్న వాడిని పెళ్లి చేసుకుంది. వారికి పెళ్లై తొమ్మిదేళ్లు అయ్యింది. అయితే వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని.. కేవలం ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
అయితే బాలీవుడ్ మీడియా మాత్రం ఊర్మిళకు ..భర్త కు అసలు పడడం లేదని అందుకే ఊర్మిళ విడిపోవాలనుకుంటుందని ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై ఊర్మిళ మాత్రం నోరు మెదపలేదు. డైరక్ట్ గా విడాకులు మంజూరు అయ్యాక చెప్తుందేమో చూడాలి.