Bollywood: ప్రియాంక చోప్రాకు ప్ర‌మాదం 2024-06-20 16:10:51

న్యూస్ లైన్ సినిమా: మాజీ మిస్ వ‌రల్డ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ఒక‌ హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రియాంక స్టంట్స్ చేస్తుండ‌గా స్వ‌ల్ప గాయ‌లు అయిన‌ట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదిక‌గా గురువారం తెలిపింది. “ది బ్ల‌ఫ్” షూటింగ్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జరిగిందని వీడియో విడుదల చేసింది. మీరు యాక్షన్ సినిమాలు చేసినప్పుడు అది నిజంగా గ్లామరస్‌గా ఉంటుంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రియాంక ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఆమె న‌టిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. బాయ్స్ ఫేమ్ ‘కార్ల్ అర్బ‌న్’ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాకి ఫ్రాంక్ ఈ ఫ్ల‌వ‌ర్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో జ‌రుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లోనే తాను రిస్కీ స్టంట్స్ చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్రమంలోనే షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని పేర్కొంది.